Homeహైదరాబాద్latest Newsసీఎం చంద్రబాబుతో ఉత్తమ్ కీలక సమావేశం.. ఈ మీటింగ్ అందుకేనా..?

సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ కీలక సమావేశం.. ఈ మీటింగ్ అందుకేనా..?

నేడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశం కానున్నారు. నేడు విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సాయంత్రం సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. అయితే..ఈ భేటీ మర్యాద పూర్వకమైనదిగా చెబుతున్నారు. కానీ వాస్తవం అది కాదని సమాచారం. తన చిన్న నాటి మిత్రుడిని పరామర్శించేందుకు విజయవాడ కు ఇవాళ వెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఈ తరుణంలోనే… ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఏది ఏమైనా వీరి సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Recent

- Advertisment -spot_img