చార్ ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్ తీయడానికి వీల్లేదు. ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు వర్తిస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ కొంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తుండటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. కాగా చార్ ధామ్ యాత్రకు ఇప్పటికే దేశ, విదేశాల నుంచి దాదాపు 26 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటివరకు 3 లక్షల మంది సందర్శించారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా సాగుతూ బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది.