Homeహైదరాబాద్latest Newsతిరుమలలో వైకుంఠ ఏకాదశి.. టికెట్ల జారీ తేదీలు ఇవే..!

తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. టికెట్ల జారీ తేదీలు ఇవే..!

తిరుమలలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు.. తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయించనున్నారు అని తెలిపారు.

Recent

- Advertisment -spot_img