786 సంఖ్యకు ఇస్లాంలో ఎందుకు అంత ప్రాదాన్యత..
786 సంఖ్యను మహమదీయులు ఎంతో పవిత్రమైనది గా, ఏంతో అదృష్ట దాయకమైనది గా భావిస్తారు.
ఇక కొన్నాళకు దాని ఉన్న నమ్మకం ఇతర ధర్మాల వారికి కుడా పాకింది.
కానీ అసలు ఈ సంఖ్య ఏమిటి ? దీని గొప్పతనం ఏమిటి??
ఈ సంఖ్య “బిస్మిల్లాహ్ అల్-రహ్మాన్ అల్-రహీం ” అన్న వాక్యాన్నీ సూచిస్తుంది ,
దాని అర్ధం “అల్లాహ్, ఓహ్ దయగల వాడా , ఓహ్ కరుణామయుడా “. ప్రతి పని ఆరంభించే ముందు దీనిని తలుచుకుంటే మంచి జరుగుతుంది అని వారు భావిస్తారు.
మరి ఆ వాక్యం ఇలా అంకెల్లోకి ఎలా మారింది?
ఆ వాక్యం లోని ప్రతి అక్షరానికి ఒక సంఖ్యిక విలువ ఉంటుంది ఆ విలువలని కూడితే 786 అవుతుంది .
మరి ఆ అక్షరాలలు ఆ విలువలు ఎలా ఇచ్చారు ?
దాని కోసం అబ్జాడ్ అంకెల వ్యవస్ధను వాడారు . అందులో వారి వర్ణమాలలొని మొదటి 9 అక్షరాలకు 1–9 విలువలు , తరువాతి 9 అక్షరాలకు 10–90 విలువలు , ఆలా అన్ని అక్షరాలకు ఇచ్చారు . దానిని క్రింద చూడగలరు .
అలీఫ్ – 1, బా – 2, జీమ్ – 3, దాల్ – 4, హా (చిన్న) – 5, వా – 6, జా – 7, హా (పెద్ద) – 8, తౌ – 9
యా – 10, కాఫ్ – 20, లామ్ – 30, మీమ్ – 40, నూన్ – 50, సీన్ – 60, అయిన్ – 70, ఫా – 80, సౌద్ – 90
క్వాఫ్ – 100, రా – 200, షీన్ – 300, తా – 400, థా – 500, ఖా – 600, థాల్ – 700, ధౌద్ – 800, థౌ – 900, ఘైన్ – 1000
ఆలా ఈ వాక్యంలో ఉన్న ప్రతి అక్షరానికి ఈ విలువలు వస్తున్నాయి:
బా = 2; సీన్ = 60; మీమ్ = 40; అలీఫ్ = 1; లామ్ = 30; లామ్ = 30; హా (చిన్న) = 5; అలీఫ్ = 1; లామ్ = 30; రా = 200; హా (పెద్ద) = 8; మీమ్ = 40; నూన్ = 50; అలీఫ్ = 1; లామ్ = 30; రా = 200; హా (పెద్ద) = 8; యా = 10; మీమ్ = 40.
ఇక ఈ విలువలన్ని కలిపితే 786 వచ్చింది .
ఆలా 786 అనేది ఈ వాక్యానికి ప్రతీకగా ప్రాచుర్యం పొందిది .
ఈ సంఖ్య సీరియల్ అంకె ఉన్న డబ్బు నోట్లకు కూడా సేకర్తలు ఆసక్తి కనబరుస్తున్నారు .
ఆ వాక్యమును పవిత్రంగా భావించే కొందరు మహమదీయులు ఇలా సంక్షిప్త రూపాలు వాడుటను వ్యతిరేకిస్తున్నారు కూడా .
ఇదండీ ఈ మూడంకెల వెనుకున్న చరిత .