Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షుడిగా వంగూరు దిలీప్ ఎన్నిక

కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షుడిగా వంగూరు దిలీప్ ఎన్నిక

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం గుడూరు గ్రామానికి చెందిన వంగూరు దిలీప్ ను కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో ప్రజలకు సుభిక్ష పరిపాలన అందించి, సిరిసిల్లను సిరిశాల అభివృద్ధి గావించిన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలను అందిస్తూ ప్రజల మెప్పు పొందిన నాయకుడిగా ఎదిగారు. ఈ సందర్భంగా ప్రజల తీర్పును శిరసావహిస్తూ అధికారంలో లేకున్నా కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులుగా ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో యువ నాయకులను ఎన్నుకొని రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పోరాడుతూ శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగానే ముస్తాబాద్ మండల యువ నాయకుడు వంగూరు దిలీప్ ను కేటీఆర్ సేన మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా అధ్యక్షునిగా నరేంద్ర చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మెంగని మనోహర్ ఎన్నికైన యువ నాయకులకు ప్రజల్లో ఉంటూ పదేళ్లలో కేసీఆర్ చేసినటువంటి మహోత్తర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి కెసిఆర్ సీఎం కావాలి అనే విధంగా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.

Recent

- Advertisment -spot_img