ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపరంలో అడుగు పెడుతున్నారు. నేటి నుంచి జనసేనాని వారాహి విజయభేరి యాత్ర పేరిట ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం గం.12.30 నిమిషాలకు పిఠాపురం చేరుకుంటారు.
ఈ పర్యటనలో భాగంగా అక్కడ కొలువై ఉన్న శక్తి పీఠం పురుహుతికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మతో భేటీ కానున్నారు. సా. 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయభేరీ సభలో పాల్గొంటారు.