Homeహైదరాబాద్latest Newsవార్నీ ఇదేం లొల్లిరా.. పెళ్లి విందులో మటన్‌ కోసం కొట్లాట.. చివరకి ఏం జరిగిందంటే..?

వార్నీ ఇదేం లొల్లిరా.. పెళ్లి విందులో మటన్‌ కోసం కొట్లాట.. చివరకి ఏం జరిగిందంటే..?

పెళ్లి భోజనంలో మటన్ కోసం వధూవరుల తరుపు బంధువులు పరస్పరం దాడి చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో బుధవారం ఇది జరిగింది. నవీపేటకు చెందిన యువతికి నందిపేట మండలానికి చెందిన యువకుడితో పెళ్లి జరిగింది. భోజనాల సమయంలో ముక్కలు తక్కువ వేశారని వడ్డించే వారితో కొందరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాలు గరిటెలు, రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అయితే పెళ్లి వేడుకలో గొడవ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఘర్షణకు కారణమైన రెండు గ్రూపులపై కేసులు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img