Homeహైదరాబాద్latest NewsVavar Juma Masjid : అయ్యప్ప స్వాములు వావర్ మసీదుకి వెళ్ళకూడదు..? పండితులు ఏమంటున్నారంటే..?

Vavar Juma Masjid : అయ్యప్ప స్వాములు వావర్ మసీదుకి వెళ్ళకూడదు..? పండితులు ఏమంటున్నారంటే..?

Vavar Juma Masjid : వావర్ మజీద్.. అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే వారు.. ముందుగా వావర్ మసీదును సందర్శిస్తారు. శబరిమల ఆలయానికి తూర్పు దిశలో సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మసీదు ఉంటుంది. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులందరూ ముస్లిం మసీదు అయిన వావర్ మసీదుకు ఎందుకెళ్తారు.. ఆ మసీదు చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు.. అక్కడ నైవేద్యాలను స్వీకరించడం వెనుక కారణం ఏంటంటే.. పురాణాల ప్రకారం, వావర్ యుద్ధ విద్యలో ఎంతో నైపుణ్యం కలవాడు. తను ఒకసారి అయ్యప్ప స్వామితో మూడు రోజుల పాటు యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో సమ ఉజ్జీలుగా నిలిచారు. ఆ సమయంలోనే అయ్యప్ప తన చేతిలోని ఆయుధాన్ని పడేసి, వావర్ ను ఆలింగనం చేసుకుని, తనతో స్నేహం చేశాడు. ఆ తర్వాతి కాలంలో వావర్ అయ్యప్పకు ప్రముఖ శిష్యుడైనట్లు చొప్పుకుంటారు.

అయితే దీన్ని పలువురు పండితులు కొట్టి పడేస్తున్నారు. అదంతా నిజం కాదని.. ఇది కుట్రలో భాగంగా అయ్యప్ప భక్తులు వావర్ మసీదును సందర్శించే పద్ధతిని కొందరు సృష్టించారని అంటున్నారు. అలాగే హిందువులు సమాధుల ముందు తలవంచకూడదని, చేతులు ముడుచుకోకూడదని హిందూ మతం స్పష్టంగా బోధిస్తున్నదని వారు స్పష్టం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img