Homeహైదరాబాద్latest NewsVD12: విజయ్ దేవరకొండ మాస్ పోస్టర్ కు.. ఊర మాస్ రెస్పాన్స్.. ఊచకోత పోస్టర్ అంటే...

VD12: విజయ్ దేవరకొండ మాస్ పోస్టర్ కు.. ఊర మాస్ రెస్పాన్స్.. ఊచకోత పోస్టర్ అంటే ఇదే అంటూ కామెంట్స్..!

జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ VD12 అనే కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి నిన్న అనగా (02-08-2024) రోజున ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీం. ఈ మాస్ పోస్టర్ కి ఊర మాస్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఊచకోత పోస్టర్ అంటే ఇదే అంటూ విజయ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ భీకరమైన లుక్లో వర్షంలో తడుస్తూ..ముఖంపై రక్తం కారుతున్నట్లుగా కనబడుతున్నారు. అలా కారుతున్న నెత్తురుతో కోపంతో కూడినగంభీరమైన అరుపుతో ఆకాశంలో చూస్తూన్నాడు. ఈ పోస్టర్ లో “అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు..రక్తపాతం..ప్రశ్నలు..పునర్జన్మ” అంటూ విభిన్నమైన క్యాప్షన్ తో సినిమాపై ఆసక్తి రేపారు. ఇక ఈ పోస్టర్ చూసాక దేవరకొండకు సాలిడ్ హిట్ ఖాయం అంటూ సినీ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img