VD14 : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 35వ పుట్టిన రోజు సందర్భంగా ‘VD14’ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో “The Legend of the Cursed Land. 1854-1878” అనే ట్యాగ్‌లైన్‌తో ఒక రాజు విగ్రహం ఉంది.. ఇది 19వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో సెట్ చేయబడిన కథను సూచిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నాడు. విజయ్ బాడీ మాత్రం వేరే లెవెల్ ఉంది.. ఈ సినిమాతో బాక్సాఫీస్ షాకవ్వాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతుంది అని సమాచారం.