ఇదే నిజం, గొల్లపల్లి: వేదవిద్య సామ్రాట్ అవార్డు పొందిన సందర్భంగా సత్యాచారిని సత్కరించిన మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవిందుల లావణ్య-జలపతి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామనికి చెందిన సత్యాచారిని ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్ తెగులు సాంస్కృతి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేదవిద్య సామ్రాట్ అవార్డు పొందిన సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవిందుల లావణ్య-జలపతి సత్యాచారిని సత్కరించారు.ఈ సందర్భంగా గోవిందుల జలపతి మాట్లాడుతూ మారు మూల పల్లెలో పుట్టి ఇంత గొప్ప ఘనత సాదించడం మాకు మా ఊరికి చాలా గర్వకారణం అన్నారు.విద్య అనేది వ్యక్తి ఎదుగుదలకు కీలక భూమిక పోషిస్తుంది.ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఉన్నత విద్యను అభ్యసించి సత్యాచారి ఈ స్థాయికి చేరారని గుర్తు చేశారు.పిల్లలకి విద్యనే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు అన్నారు.అలాగే సత్య చారి ఇంకా ఎంతో మంది వేద విద్యార్థులకు సేవలు అందించాలని సనాతన ధర్మం కోసం కృషి చేయాలని ఆశిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో గడప రమేష్,జుట్టు సత్యం,ఎనగందుల కుమార్,జుట్టు కొమురెల్లి పాల్గొన్నారు.