Homeఆంధ్రప్రదేశ్గాడిదలను కాస్తున్నాడు

గాడిదలను కాస్తున్నాడు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వీర వెంకట కిరణ్ కుమార్ అందరికంటే డిఫరెంట్‌గా ఆలోచించాడు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గాడిదల పెంపకం ద్వారా ఉపాధి పొందుతూ, మరికొంత మందికి ఉపాధి కలిపిస్తున్నాడు. కొంతకాలం ఐటీలో ఉద్యోగం చేసిన కిరణ్ కుమార్ కరోనా కారణంగా 2021లో సొంతూరుకు చేరుకున్నాడు. ఆ సమయంలోనే కొడుకుకు అనారోగ్య సమస్యలు ఉండటంతో గాడిద పాల గురించి తెలుసుకున్నాడు. గాడిద పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగడంతో పాటు ఈ పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసుకుని గాడిదలను పెంచాలన్న ఆలోచనకు వచ్చాడు. స్థానికంగా ఎవరూ గాడిదలను పెంచడం లేదు. వీటికి మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి పక్కా ప్రణాళికతో పెంపకం చేపడితే తప్పక లాభాలు దక్కుతాయని గుర్తించి ఓ ఐఐటీ విద్యార్ధి నవ్య గంపలతో కలిసి రాజానగరం మండలం, మల్లంపూడిలో పది ఎకరాల విస్తీర్ణంలో గాడిదల ఫామ్‌ నెలకొల్పి పెంపకం ప్రారంభించాడు.

Recent

- Advertisment -spot_img