Veg vs NonVeg : వెజ్ మంచిదా లేదా నాన్‌వెజ్ మంచిదా.. ఇదిగో ప్రూఫ్స్..
Veg vs NonVeg – ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది. శాకాహారమా.. లేక మాంసాహారమా.. అంటే చాలామంది శాకాహారం అని బల్లగుద్ది మరీ చెబుతారు.
కొందరు మాత్రం మాంసాహారం కూడా ఆరోగ్యానికి మంచిదే.
ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు, బీ12 లాంటి కొన్ని విటమిన్స్.. మాంసాహారంలోనే ఎక్కువగా దొరుకుతాయని… మాంసాహారం తింటేనే మనిషి బలంగా తయారవుతాడని అంటారు.
వీటిలో దేన్ని నమ్మాలి అనేదానిపై అస్సలు క్లారిటీ ఉండదు.
అందుకే.. ఓ కవల జంట.. శాకాహారం తింటే మంచిదా.. లేక మాంసాహారం తింటే మంచిదా అనేదానిపై ఏకంగా వాళ్ల మీదనే రీసెర్చ్ చేసుకున్నారు.
ఆ రీసెర్చ్‌లో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి.
లండన్‌కు చెందిన హుగో, రోస్ టర్నర్.. ఇద్దరూ కింగ్స్ కాలేజీ లండన్‌లో శాకాహారం, మాంసాహారంలో ఏది ఆరోగ్యకరం అనే దానిపై రీసెర్చ్ చేస్తున్నారు.
దానిలో భాగంగా 12 వారాల పాటు.. ఇద్దరిలో ఒకరు పూర్తిగా శాకాహారం, మరొకరు పూర్తిగా మాంసాహారాన్ని తీసుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరి శరీరాల్లో జరిగిన మార్పులను గమనించి షాక్ అయ్యారు.
హుగో… 12 వారాల పాటు.. పూర్తిగా నాన్ వెజ్ తినడం మానేశాడు. డెయిరీకి సంబంధించిన పదార్థాలను కూడా తీసుకోలేదు.
ఫ్రూట్స్, నట్స్, కూరగాయలు ఎక్కువగా తీసుకున్నాడు.
రోస్ మాత్రం ప్రతి రోజు 12 వారాల పాటు పాల ఉత్పత్తులతో పాటు మాంసం, చేపలు తీసుకున్నాడు.
హుగోకు 12 వారాల సమయంలో షుగర్ లేవల్స్ నార్మల్‌గా ఉన్నాయి.
రోజూ యాక్టివ్‌గా, ఎనర్జీతో ఉన్నాడు. మాంసం తినే రోస్ మాత్రం కొన్ని రోజులు యాక్టివ్‌గా మరికొన్ని రోజులు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించారు.
అలాగే.. హుగో శరీరంలో ఉన్న గట్ బ్యాక్టీరియాలోను మార్పులు రావడం గమనించారు.
వాటి శాతం క్రమక్రమంగా హుగోలో తగ్గింది. కానీ.. నాన్ వెజ్ తిన్న రోస్ శరీరంలో మాత్రం ఎటువంటి మార్పు కనబడలేదు.
12 వారాల తర్వాత.. హుగో బరువు తగ్గాడు. బాడీలోని కొలెస్టరాల్ లేవల్స్ తగ్గాయి.
185 పౌండ్స్ నుంచి 181 పౌండ్స్‌కు వచ్చాడు. రోస్ మాత్రం బరువు పెరిగాడు.
189 పౌండ్స్‌కు పెరిగాడు. శరీరంలో ఫ్యాట్ కూడా పెరిగింది.
ఆ కవల జంట ఆచరణాత్మక పరిశోధన ప్రకారం.. మాంసాహారం కన్నా.. శాకాహారం తింటేనే ఆరోగ్యంగా ఉంటారని రుజువైంది.
నిత్యం నాన్ వెజ్ తినడం వల్ల బరువు పెరగడం, బాడీలో ఫ్యాట్ పెరగడం.. ఇతర సమస్యలు పెరుగుతాయని వాళ్లు తమ స్టడీ ద్వారా తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి
వెడ్డింగ్ సీజన్‌లో ఈ డైట్ ఫాలో అయితే మంచిది
మట్టి కుండల్లోనే ఎందుకు వండాలి.. సైన్స్ ఏంటి