Venkatesh : విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన సినిమా ”సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా రిలీజైన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ రాబెడుతుంది. ఈ సినిమా కేవలం 15 రోజుల్లో 300 కోట్ల రూపాయల వసూలు చేసింది. దీనికి సంబందించిన అధికారక పోస్టర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. అలాగే వెంకటేష్ రూ. 300 కోట్ల క్లబ్లో చేరిన మొదటి తెలుగు సీనియర్ హీరోగా రికార్డు సృష్టించారు. దీంతో ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో అరుదైన మైలురాయిగా నిలిచిపోతుంది.ఈ సినిమా ఫామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్టన్స్ వసూలు చేస్తుంది. ఈ సినిమాని ”శ్రి వేంకటేస్వర క్రియేషన్స్” బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.