విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2025లో జనవరి 14న విడుదల కానుంది. గతంలో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్’2, ‘ఎఫ్3’ సినిమాలు హిట్ కొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రెండు పాటలు హిట్టయ్యాయి. ఇప్పుడు మూడో పాట టీజర్ కూడా అదే విధంగా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో మూడో పాట ఎవరితో పాడాలి అని హీరోయిన్స్‌తో మాట్లాడుతున్నప్పుడు..ఎక్కడున్నా వెంకటేష్ వచ్చి ‘నేను పాడతాను’ అంటారు. తొలుత తనను విడిచిపెట్టిన అనిల్ రావిపూడి ఆ బాధను తట్టుకోలేక సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను పాడించేయమంటారు. అయితే ఈ సినిమాలో మూడో పాటని వెంకటేశ్ పాడారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీర్లోయిన్లుగా నటించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు.