ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. జైలుకు వెళ్లిన వారంతా సీఎం అయ్యారని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2028, 2029లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు