Homeహైదరాబాద్latest NewsVenu swamy: ఇంకా బుద్దిరాని వేణు స్వామి.. అదే పిచ్చి వాగుడు.. మరో 6 నెలల్లో...

Venu swamy: ఇంకా బుద్దిరాని వేణు స్వామి.. అదే పిచ్చి వాగుడు.. మరో 6 నెలల్లో ఆ స్టార్ హీరోయిన్ కి విడాకులంటూ సంచలన వ్యాఖ్యలు..!

Venu swamy: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్పి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట విడిపోతుందని జోస్యం చెప్పి సంచలనం సృష్టించారు. అయితే ఆయన తాజా ఎన్నికల్లో ఇచ్చిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలింది. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో ఇకపై అంచనాలు వేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గతంలో తాను చెప్పినది 90 శాతం సక్సెస్, 10 శాతం ఫెయిల్యూర్ అని, అయితే 90 శాతం సక్సెస్ గురించి ఎవరూ మాట్లాడడం లేదని వేణు స్వామి అన్నారు. విమర్శకులను పట్టించుకోనని, పని పాట లేని వారే నన్ను విమర్శిస్తారని అన్నారు. ఈ సమయంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు. పెళ్లి తర్వాత రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు బాగా కలిసిరాదని, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, నేను చెప్పినట్టుగా ఆమె చెప్పినట్లే వైవాహిక జీవితం సాగిపోతుందని వేణు స్వామి అన్నారు. ఆరు నెల‌ల్లో ఆమె విడాకులు తీసుకుంటుంద‌ని వేణు స్వామి వెల్ల‌డించారు. ఇది అంత చుసిన నెటిజన్స్ వేణు స్వామికి ఇంకా బుద్ది రాలేదు.. వేణు స్వామి ఇక మారాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img