Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

అల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకసారి తన జీవితంలో చాలా ఎత్త చూసాడు.. అలాగే అదే సమయంలో పతనం కూడా చూసాడు. ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ మాత్రం తన అభిమాని మరణం, జైలు, ఇంటిపై దాడి తదితర సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ అపవాదులన్నింటికీ అర్జున్ జాతకం సరిగ్గా లేదు అని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసాడు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆరా తీసిన అనంతరం వేణు స్వామి మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో అల్లు అర్జున్ జాతకం సరిగ్గా లేదు. వచ్చే మార్చి వరకు సమస్య తప్పేది లేదన్న జోస్యం చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ జాతకం ప్రకారం శని ఆరవ స్థానంలో ఉన్నాడు. వచ్చే మార్చి వరకు అల్లు అర్జున్ జీవితంలో ఏమయినా జరగొచ్చు. కలియుగంలో సంపద ఉన్నచోట ఆపద కూడా ఉంటుంది. ఈ విషయం అల్లు అర్జున్‌కి బాగా తెలియాలని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

Recent

- Advertisment -spot_img