ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో..?
నిద్ర మత్తులో అధికారులు..
ఇదేనిజం, ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని చెగ్యాం గ్రామ పంచాయతి పరిధి శలేపల్లె నుండి ముంజంపల్లి మీదుగా మారేడుపల్లి వరకు ఉన్న రోడ్డు మరీ దారుణంగా తయారైంది. దాదాపు 15 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు కనీసం ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. సుమారు 4-5 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు మీదుగా ప్రయానం చేస్తూ ఉంటారు. చాలామంది ప్రయాణికులు కిందపడి ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రోడ్డు సమస్య గురించి తెలుపగా ఆయన వెంటనే స్పందించి మారేడుపల్లె నుంచి శాలపల్లె వరకు సుమారు రూ.75 లక్షల నిధులు మంజూరు చేసి ప్రోసీడింగ్ పత్రాలు విడుల చేసి ప్రజలను మెప్పించారు. వెంటనే ఎలక్షన్ కోడ్ రావడంతో రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సమస్యపై స్పందించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని అక్కడ స్థానిక ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు.