VHP అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోవడం ముమ్మాటికీ తిరుమల తిరుపతి ఆచార వ్యవహారాలను ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచడమేనని VHP అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. ఈచర్య జగన్ అహంకారాన్ని , చట్టాలపై ఆయనకు ఉన్న చిన్న చూపుకు నిదర్శనంమన్నారు. డిక్లరేషన్ పై తాను ఎందుకు సంతకం పెట్టలేదో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హిందూ ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు గౌరవించాల్సిన అవసరం జగన్కు లేదా అని ప్రశ్నించారు. తిరుమల వచ్చే భక్తులు ఏవరైనా స్వామివారి అనుగ్రహం కోసం వస్తారని గుర్తుచేశారు. ‘ధర్మో రక్షతి రక్షితః’ ను మర్చిపోతే ఎవరైనా తగిన పాపఫలం అనుభవించాల్సిందేనన్నారు. హిందూ దేవాలయాల రక్షణ కోసం స్వామీజీల ఆధ్వర్యంలో VHP ఒక మహా ఉద్యమానికి సిద్ధమవుతుందని శశిధర్ చెప్పారు.