Homeజిల్లా వార్తలు14 నుంచి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలు : ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

14 నుంచి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలు : ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే కోట లక్ష్మి కాంతారావు తెలిపారు. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల నిర్వహణ, ప్రచారం అంశాల విధివిధానాల రూపకల్పనకు భట్టి అధ్యక్షతన కేబినేట్ సబ్ కమిటీ శనివారం సమావేశమైంది. అన్ని ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జయంతి నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం వరకు జరగనున్నాయి. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ‘ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి, స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన, పారామెడికల్, నర్సింగ్ కళాశాలల ప్రారంభం, గ్రూప్ -4 ఎంపికైన వారికి నియామక పత్రాలు’ అందజేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఓ ప్రకటనలో తెలిపారు.

Recent

- Advertisment -spot_img