Homeహైదరాబాద్latest News''విడుదల పార్ట్ - 2" మూవీ ఫస్ట్ రివ్యూ..! ఎలా ఉంది అంటే..?

”విడుదల పార్ట్ – 2″ మూవీ ఫస్ట్ రివ్యూ..! ఎలా ఉంది అంటే..?

గత ఏడాది మార్చిలో రిలీజైన ‘విడుదల’ సినిమా మొదటి భాగం ఘనవిజయం సాధించింది. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో రెండో పార్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ ‘విడుదల పార్ట్ 2’ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.. ‘విడుదల’ మొదటి భాగంలో విజయ్ సేతుపతిని సూరి సహాయంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. రెండో భాగం అక్కడి నుంచి మొదలవుతుంది. విజయ్ సేతుపతిని అరెస్టు వార్తను ప్రజలకు ఎలాగైనా కప్పిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అప్పటికి విజయ్ సేతుపతి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఇంతలో వత్తియార్ చరిత్ర మరియు అతనికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌లు ఈ సినిమాలో చూపిస్తారు. ఎట్టకేలకు విజయ్ సేతుపతి పోలీసుల నుంచి తప్పించుకున్నాడా? అతనికి ఏమైంది? అనేది మిగిలిన కధ.
అయితే ఈ సినిమాతో వెట్రిమారన్‌ గొప్ప దర్శకుడని మరోసారి నిరూపించుకున్నారు. సినిమా మొత్తంలో వెట్రిమారన్‌ చెప్పే రాజకీయాలు, డైలాగులు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పీపుల్స్ ఆర్మీని ఏర్పాటు చేసిన తీరు బాగానే ఉంది. పెరుమాళ్ వాతియార్‌గా ఎలా రూపాంతరం చెందుతాడో మొదటి నుండి చివరి వరకు బాగా చూపించారు. విజయ్ సేతుపతి తన 100% ఎఫర్ట్ ఈ సినిమాకి అందించాడు. తన నటనతో ఓ ఫైటర్‌ని మన కళ్ల ముందు ఉంచాడు. అడవిలో కథ చెబుతూ పోలీసులను తీసుకెళ్ళే సన్నివేశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి.ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్స్‌లో అద్భుతంగా రాసాడు డైరెక్టర్. ఈ సినిమా ఒక మంచి కధతో వెట్రిమారన్‌ తెరకెక్కించిన తీరు చాలా బాగుంది.

Recent

- Advertisment -spot_img