రౌడ్ట్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాల్లో నటించారు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే రష్మిక, విజయ్ కలిసి మాల్దీవులు వెళ్లడం, కలిసి విదేశాల్లో తిరగడం.. పండుగ రోజుల్లో విజయ ఇంట్లో రష్మిక ఉండటం ఇలా చూస్తే వీరిద్దరూ కచ్చింతగా కచ్చితంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి తండ్రి స్వయంగా మాట్లాడుతున్నాడని కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ తండ్రి గోవర్ధన్‌ని కొడుకు పెళ్లి గురించి అడగ్గా.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడని, గౌతమ్ సినిమా జరుగుతోందని, సంక్రాంతి తర్వాత మైత్రీ మూవీస్‌లో సినిమా ఉంటుందని, విజయ్ కి టైమ్ వచ్చినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తామని చెప్పారు. దీనికి మరో ఆరు నెలల నుంచి ఏడాది పట్టే అవకాశం ఉందన్నారు. దీని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి 2025లోనే జరిగినట్లు తెలుస్తుంది.