దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా మిర్నాలిని రవి హీరోయిన్ గా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “రోమియో”. ఇక ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రం నేటి నుండి స్ట్రీమింగ్ యాప్‌లు ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు తమిళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తెలుగులో “లవ్ గురు” పేరుతో విడుదలైన ఈ వెర్షన్ ఇంకా ఓటిటిలో విడుదల కాలేదు. మరి దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భరత్ ధనశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మీరా ఆంటోని నిర్మించారు.