Homeహైదరాబాద్latest NewsVijay Devarakonda Birthday Special: కష్టపడి పైకొచ్చాడు.. కానీ కిందికి నెట్టేస్తున్నారు..!

Vijay Devarakonda Birthday Special: కష్టపడి పైకొచ్చాడు.. కానీ కిందికి నెట్టేస్తున్నారు..!

విజయ్ దేవరకొండ.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి నేడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. తన సినిమాలతో, తన మాటలతో అభిమానులని, ప్రేక్షకులని సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు.

ఏ రంగమైనా సరే బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి నిలబడ్డాడు. సైడ్ క్యారెక్టర్స్, పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ వచ్చాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో రిషి అనే కీలక పాత్ర చేసి నటుడిగా నలుగురి కంట్లో పడ్డాడు. ‘పెళ్లిచూపులు’ మూవీతో ఫస్ట్ హిట్ కొట్టేశాడు. ఇక ‘అర్జున్ రెడ్డి’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విజయ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎవరిని అడిగినా అదే చెప్తారు.

ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్, ఆటిట్యూడ్, మేనరిజమ్స్.. ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దీని తర్వాత చేసిన ‘గీతగోవిందం’ మూవీ విజయ్‌లోని క్యూట్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అలా వరసగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ అందుకున్న విజయ్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో విజయ్‌ని ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్ అనే రేంజులో ఆకాశానికెత్తేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సినిమాల విషయంలో విజయ్ తప్పటడుగులు వేశాడా? లేదా కొందరు అభిప్రాయ పడినట్లు.. తన ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు కావాలని తన సినిమాలని ట్రోల్ చేసి తనను కిందికి నెట్టాలని చూస్తున్నారా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఎవరు ఎమన్నా విజయ్ దేవరకొండ మన టాలీవుడ్ వజ్రం.. తన రాబోయే సినిమాలు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ.. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన విజయ్ దేవరకొండకు ఇదే నిజం వెబ్ డెస్క్ తరపునుండి పుట్టిన రోజు శుభాకంక్షాలు.

Recent

- Advertisment -spot_img