ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ‘పుష్ప 3’ మూవీ ఉందని ఆ సినిమ సౌండ్ మిక్సింగ్ టీమ్ ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని విజయ్ 2022లోనే ప్రకటించాడు. ‘పుష్ప 3 ది ర్యాంపేజ్’ సినిమాలో విజయ్ దేవరకొండ నటించనున్నాడు అని తెలుస్తుంది. అయితే గతంలో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉందని ప్రకటించారు. ఆ క్రమంలో సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ 2022 లో ట్విట్ చేసాడు. ‘మీతో సినిమా ప్రారంభించడానికి వేచి ఉండలేను’ అంటూ 2021 – ది రైజ్, 2022 – రూల్, 2023 – రాంపేజ్ అంటూ విజయ్ ట్విట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే విజయ్ దేవరకొండ ‘పుష్ప 3’ మూవీ ఉందని 2022లోనే చెప్పసాడు. దీనిని బట్టి ‘పుష్ప 3’ సినిమాలో అల్లుఅర్జున్ , విజయ్ దేవరకొండ మధ్య వచ్చే సీన్స్ కి థియేటర్లలో షాక్ అవడం కన్ఫర్మ్. ‘పుష్ప 3’ మూవీలో విజయ్ దేవరకొండ పాత్రా ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది.