Homeహైదరాబాద్latest NewsVijay Deverakonda : భారతదేశం ఎప్పటికీ తలవంచదు

Vijay Deverakonda : భారతదేశం ఎప్పటికీ తలవంచదు

Vijay Deverakonda : జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటివరకు 26 మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటనపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేసారు. రెండేళ్ల క్రితం పహల్గామ్‌లో తన పుట్టినరోజును జరుపుకున్నానని, అక్కడి స్థానిక ప్రజల ఆప్యాయత తనకు నచ్చిందని అన్నారు. నిన్న జరిగిన సంఘటన హృదయ విదారకంగా ఉందని. ఈ ఘటన ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తోందని అన్నారు.టూరిస్టులపై కాల్పులు జరపడం దారుణమని విజయ్ అన్నారు. బాధితులకు మరియు వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము. కాశ్మీర్‌కు మేము అండగా నిలుస్తాం అని అన్నారు. భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదు అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేసారు.

Recent

- Advertisment -spot_img