Vijay Deverakonda : ప్రధాని మోడీని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కలిశాడు. ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ మీడియా ఏర్పాటు చేసిన సమ్మిట్ లో మన ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ యామి గౌతమ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఉన్నారు. అయితే ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత వీరంతా ప్రధాని మోదీని కలిశారు. వారంతా ప్రధాని మోడీతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమా మే 30న థియేటర్లో విడుదల కానుంది.