HomeEnglishVijay fans over action విజయ్​ ఫ్యాన్స్​ ఓవర్​ యాక్షన్​

Vijay fans over action విజయ్​ ఫ్యాన్స్​ ఓవర్​ యాక్షన్​

– థియేటర్​ లో విధ్వంసం
– సీట్లను విరగ్గొట్టి హంగామా

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: తమిళ అగ్రనటుడు విజయ్​ అభిమానులు రెచ్చిపోయారు. ఓ థియేటర్​ లో హంగామా సృష్టించారు. కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నటించిన ‘లియో’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా అభిమానులు అత్యుత్సాహంతో థియేటర్లో బీభత్సం సృష్టించారు. గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను చెన్నైలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. దానికి మిశ్రమ స్పందన రావడంతో ఫ్యాన్స్‌ అసహనానికి గురయ్యారు. దీంతో థియేటర్లోని సీట్లను విరగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ‘లియో’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై విజయ్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ వాటిని అందుకోలేకపోయిందని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో నిరాశకు గురైన కొందరు అభిమానులు థియేటర్లో విధ్వంసం సృష్టించారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం థియేటర్‌ యాజమాన్యం అనుకున్న సమయానికి ట్రైలర్‌ను ప్రదర్శించలేదని అందుకే అభిమానులకు ఆగ్రహం వచ్చి ఇలా చేశారని అంటున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img