Vijay vs Manoj : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ”కింగ్‌డమ్” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాని మే 30న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఈరోజే ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. అయితే సడన్‌గా మంచు మనోజ్ కూడా తన సినిమా రిలీజ్ తేదిని ప్రకటించాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా ”భైరవం”. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న మనోజ్ సినిమా ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ సినిమా మే 30న విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండకు పోటీగా మనోజ్ రానున్నాడు. అయితే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ కింగ్‌డమ్ కూడా అదే రోజున విడుదల కానుంది. ఒకే రోజు విడుదుల కానున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాయో చూడాలి.