Homeహైదరాబాద్latest NewsVijayasai Reddy : వైసీపీ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి...

Vijayasai Reddy : వైసీపీ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి

Vijayasai Reddy : వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కీలక ప్రకటన చేసారు. అయన రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు అని తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం అని పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అని అన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతలు చెప్పారు. ఇక భవిష్యత్తులో వ్యవసాయం చేయనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img