Homeహైదరాబాద్latest NewsVijayashanti : కావాలనే చేస్తున్నారు..ఇకపై మానుకోండి.. వారికీ విజయశాంతి గట్టి వార్నింగ్‌

Vijayashanti : కావాలనే చేస్తున్నారు..ఇకపై మానుకోండి.. వారికీ విజయశాంతి గట్టి వార్నింగ్‌

Vijayashanti : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ”అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి”. ఈ సినిమాలో ఒక్కపుడు హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లో విడుదలైంది. ఈ క్రమంలో విజయశాంతి నెగెటివ్ ప్రచారం చేస్తున్న ట్రోలర్స్ మరియు రివ్యూర్స్ కు కఠిన వార్నింగ్ ఇచ్చారు. సినిమా విజయవంతంగా రన్ అవుతున్న సమయంలో కొందరు సినిమాపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ దాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. “సినిమా కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయినప్పటికీ కొందరు దుష్ట శక్తులు సినిమాను ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సాడిజం తప్ప మరొకటి కాదు. నిర్మాతలు కోట్లు ఖర్చు చేస్తున్నారు, నటులు, సాంకేతిక నిపుణులు కష్టపడుతున్నారు. అలాంటి సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడం సరికాదు. మీకు సినిమా నచ్చకపోతే దూరంగా ఉండండి, కానీ ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు.. ఇది నా వార్నింగ్” అని అన్నారు.

Recent

- Advertisment -spot_img