పా రంజిత్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” పై భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం అప్పటి పరిస్థితులకు వ్యతిరేకంగా, కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నివాసుల కథగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 26న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈ సినిమాను ఆగష్టు 15న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.