Homeహైదరాబాద్latest Newsఎంపీటీసీని సన్మానించిన గ్రామస్థులు.. ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ప్రశంసలు

ఎంపీటీసీని సన్మానించిన గ్రామస్థులు.. ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ప్రశంసలు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో గ్రామస్థులు బుధవారం గ్రామ ఎంపీటీసీ భోగ వందన గంగాధర్ లను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.నేటితో పదవి కాలం ముగుస్తుండడంతో గ్రామస్థులు పదవి విరమణ కార్యక్రమాన్ని గ్రామ పంచాయితీ వద్ద ఏర్పాటు చేసి ఘజ మాలతో సత్కరించారు. గత ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశారని పలువురు నాయకులు కొనియాడారు.

కరోనా వంటి విపత్కరమైన పరిస్థితుల్లో సైతం కరోనా సోకిన వారికి మనోదైర్యం ఇవ్వడంతో పాటు కోవిడ్ వల్ల చనిపోయిన వారి దహన సంస్కారాల్లో ముందుండి చేయడం అభినందనీయం అని బాజపా మండల అధ్యక్షులు కొమ్ముల రాజపాల్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పాలన అధికారి ఎఇ రాజు, కార్యదర్శి ప్రశాంత్, స్థానికులు ఇల్లేందుల శ్రీనివాస్, పుల్ల జగన్ గౌడ్,డబ్బ రాజారెడ్డి, గడ్డం శివారెడ్డి, ముదాం నర్సింలు, కొట్టాల శ్రీనివాస్, రాజేష్, బ్రహ్మానందం, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img