Homeతెలంగాణవినాయక మండపాలకు అనుమతి లేదు: ప్రభుత్వం

వినాయక మండపాలకు అనుమతి లేదు: ప్రభుత్వం

కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలోఈ వినాయకచవితికి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెహర్రం, వినాయకచవితి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో వినాయక పూజలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రజలకు ప్రభుత్వం సైతం ప్రజలకు సూచించింది. 5 అడుగుల ఎత్తులోపు విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, ప్రజలు మట్టి విగ్రహాలను తెచ్చుకుని పూజించాలని గణేష్ ఉత్సవ కమిటీలు ప్రజలకు పిలుపునిస్తున్నాయి. భారీ విగ్రహాలు, సెట్టింగ్‌లు ఏర్పాటు చేయవద్దని గణేష్ ఉత్సవ కమిటీలకు కూడా ప్రభుత్వం తరపున ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. పూజలో అర్చకునితో పాటు ఒక జంట దంపతులు మాత్రమే కూర్చోవాలని గణేష్ ఉత్సవ కమిటీలు భక్తులకు సూచించాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img