ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ పొగాట్‌కు భారీ షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే రెజ్లింగ్‌లో వెయిట్ రూల్స్ ప్రకారం 2 రోజులు వరుసగా బరువును చెక్ చేస్తారు. ప్రిలిమినరీ రౌండ్స్ రోజుతో పాటు ఫైనల్స్ జరిగే రోజు ఉదయం కూడా వెయిట్‌ను చెక్ చేస్తారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రూల్ బుక్‌లోని ఆర్టికల్ 11 ప్రకారం.. ఒకవేళ ఎవరైనా అథ్లెట్.. తొలి రోజుతో పాటు రెండో రోజు కూడా ఒకే రకమైన వెయిట్‌ను చూపించలేని క్షణంలో ఆ అథ్లెట్‌ను కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఆ అథ్లెట్‌కు చివరి ర్యాంక్‌ను కేటాయిస్తారు.