వినోద్ కాంబ్లీ.. టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ అత్యంత సన్నిహితుడు. గత కొన్నేళ్లుగ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చాలా సార్లు తన ఆరోగ్యం బాలేదని, ఆర్థిక సమస్యలతో రోజు రోజుకు తన పరిస్థితి దిగజారిపోతుందని, సాయం చేయాలని పలు సందర్భాల్లో వేడుకున్నాడు. అయితే ఇప్పుడు వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. అతను ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇతరులు చేయి అందిస్తే కానీ అడుగులు వేయలేకపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఒకప్పుడు సచిన్ ను మించిన స్టార్ క్రికెటర్.. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటో తెలుసా..?
క్రమశిక్షణ లేకుంటే, ఎంత ప్రతిభ వున్నా ఉపయోగం లేదు అన్న దానికి వినోద్ కాంబ్లీ జీవితం నిదర్శనం.. సచిన్ టెండూల్కర్‌తో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన క్రికెటర్ వినోద్ కాంబ్లీ.. టాలెంట్ ఉన్నా, వచ్చిన స్టార్‌డమ్‌ని సరిగ్గా వాడుకోలేక పోయాడు. వ్యసనాలు, విలాసాలకు బానిసై కెరీర్‌ని అర్ధాంతరంగా ముగించాడు. తనతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కు ఆరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్ క్రమశిక్షణతో ఎంతగా ఎదిగాడో మనందరికీ తెలుసు. అందుకే వినోద్ కాంబ్లీ జీవితం యువతకు ఒక గుణపాఠం. ఏ రంగంలోనైనా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం.. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు.