అమెరికాకు చెందిన ఓ మహిళ కు అప్పుడే పుట్టిన ఓ చిన్నారి నోటిలో 32 పళ్లు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సోషల్ మీడియా ద్వారా ఓ తల్లి తన బిడ్డకు సంబంధించిన ఈ విషయాన్ని వెల్లడించింది. దీన్ని ‘నాటల్ టీత్’ అని వైద్య శాస్త్రంలో పేర్కొంటారని తెలిపింది. అయితే దీనివల్ల ఆ బిడ్డకు అంతగా ప్రమాదం లేకపోయినా పాలిచ్చేటప్పుడు తల్లికి ఇబ్బంది అవుతుందట.