దాసరి సాహితి.. పొలిమేర, పొలిమేర-2 సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ నటి ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ సమర్పించారు. తన ఆస్తులు సుమారు ఐదు లక్షలుగా చూపించారు. తన వయసు 29 ఏళ్లు అని, తనకు ఇంకా పెళ్లి కాలేదని అఫిడివిట్‌లో పేర్కొన్నారు. తన వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరానికి రూ.4,98,810గా ఉన్నట్లు వెల్లడించారు. నితిన్ ‘ఎక్స్ట్రార్డినరీ మ్యాన్’, సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ నటించిన ‘సర్కారు నౌకరీ’ సినిమాల్లోనూ సాహితి నటించారు.