మధ్యప్రదేశ్‌కు చెందిన శకున్ విశ్వకర్మ(40).. ప్రతిరోజూ తన కూతురుతో కలిసి కాలేజీకి వెళ్తుంది. తన కూతురి మీద అనుమానంతో వెళ్తోందంటే పొరబాటే. చదువు మీద తనకున్న ప్రేమతో.. 8వ తరగతి నుంచి తన కూతురితో పాటే చదువుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువులో తన కూతురు తనకు ఎంతో సహకరిస్తోందని, తద్వారా పరీక్షల్లో పాస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.