యూపీఐ సాయంతో ఖాతాలోకి నగదు డిపాజిట్ చేసే ఫీచర్ త్వరలో రానుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి డెబిట్ కార్డు/అకౌంట్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ సాయంతో డబ్బులు డిపాజిట్ ఎలా చేయాలో చెప్పాడు. మొబైల్ నంబర్ తో లింకైన UPI, VPI, IFSC కోడ్ ఏదైనా ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ ను మొబైల్ లోని UPI యాప్ ద్వారా స్కాన్ చేసి, యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఈ వీడియోలో ప్రకారం చేస్తే ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.