ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న రాత్రి దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడుతున్న తరుణంలో సంజూ శాంసన్ ఔట్ తీరును పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బంతిని నురుగా స్టాండ్స్‌లోకి పంపే క్రమంలో బౌండరీ దగ్గర షే హోప్ క్యాచ్ పట్టాడు. ఏ మాత్రం సందేహించకుండా వెంటనే సెలబ్రేట్ చేసుకున్నాడు. థర్డ్ అంపైర్ సమీక్ష ద్వారా అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. రీప్లేలో మాత్రం బంతి బౌండరీని తాకినట్లు కనిపిస్తోంది.
‘రెండుసార్లు ఫీల్డర్ బౌండరీని తాకినట్లు కనిపిస్తోందని, అంపైర్ కావాలనే ఇలా చేశాడని అనలేం అని’ భారత మాజీ ఆటగాడు నవజ్యోత్ సిద్ధూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
బౌండరీ లైన్‌కు చాలా దగ్తరగా ఉందనిపించిందని, మరిన్ని కోణాల్లో చూస్తే బాగుండేదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కాలింగ్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. అప్పటికే 45 బంతుల్లో 86 పరుగులతో ప్రమాదకరంగా ఆడుతోన్న సంజూ శాంసన్ వికెట్‌తో మ్యాచ్ దిల్లీ వైపు తిరిగింది. 20 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది.