యూపీలోని ఝాన్సీకి చెందిన బహదూర్ సింగ్ పరిహార్ ప్రతిరోజూ హెల్మెట్ పెట్టుకొని కారు నడుపుతున్నారు. అది కూడా ఆడీ కారు. ఎందుకంటే.. 2 నెలల క్రితం హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపాడనే కారణంతో అక్కడి ట్రాఫిక్ పోలీసులు అతడికి రూ.1000 ఫైన్ వేశారు. ఇదేంటని అడిగితే ఎన్నికలయ్యాక చూద్దామన్నారట. దీంతో మరోసారి ఫైన్ పడుతుందేమోనని భయంతో హెల్మెట్ పెట్టుకొని కారు నడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.