థాయ్‌ల్యాండ్‌లోని లోయీ ప్రావిన్స్ డాన్‌సాయ్ పట్టణంలో ఏటా జూన్ నెలలో దయ్యాల పండగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ‘ఫి టా ఖోన్ ఘోస్ట్ ఫెస్టివల్’గా పిలుచుకునే ఈ 3 రోజుల పండుగ మొత్తం కార్యక్రమాన్ని ‘బున్ లువాంగ్’ అంటారు. ఈ పండగలో జనాలు దయ్యాల బొమ్మలను చిత్రించిన ముసుగులను ధరించి వీధుల్లోకి వచ్చి సంప్రదాయ నృత్య గానాలతో భారీ ఊరేగింపులు జరుపుతారు.