ఎస్కలేటర్లు ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో.. అదే సమయంలో అవి అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా ఓ అమ్మాయి పాదం ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. బాలిక తల్లి ఎస్కలేటర్‌లో నుంచి కాలు బయటకు తీసేందుకు ప్రయత్నించింది. అటువంటి పరిస్థితిలో మాల్‌లో జోకర్‌గా పనిచేసే ఉద్యోగి ఎస్కలేటర్‌ను ఆపాడు. ఆ తర్వాత మాల్‌లోని ఇతర ఉద్యోగులు కూడా అక్కడికి చేరుకుని.. ఆ బాలిక కాలును లోపలి నుంచి బయటకు తీశారు.