మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాకు చెందిన ఓ యువకుడి కడుపులో ఉన్న రెండు అడుగుల సొరకాయను విజయవంతంగా బయటకు తీశారు వైద్యులు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని శస్త్రచికిత్స చేసి కాపాడారు. ఆ సొరకాయకు కొమ్ము కూడా ఉండడం వల్ల డాక్టర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే సొరకాయ వల్ల యువకుడు పెద్ద పేగు నలిగిపోయిందని, అతడి శరీరంలోకి ఆ వస్తువు మలద్వారం ద్వారా వచ్చిందని చెప్పారు.