జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీ..బిజీ గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ ఎంతో కష్టపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇతర పార్టీల నేతలు పవన్ పెళ్లిళ్ల గురించి, పవన్ భార్యల గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నా భార్యను నేను క్షమించమని అడిగానంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నా భార్య అన్నా ‘లెజినోవా’ విదేశీయురాలు అని ఆమెకు రాజకీయాలు తెలియవని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను ధర్మం కోసం నిలబడితే చివరకు నా భార్యను కూడా తిట్టారని ఆయన చెప్పుకొచ్చారు. మన దేశ రాజకీయాలు నా భార్యకు అర్థం కావని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎందుకు కుటుంబ సభ్యులను సైతం తిడతారని నా భార్య అడిగిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులను తిట్టడం వల్ల నా భార్య ఎంతో ఇబ్బంది పడిందని ఆయన కామెంట్లు చేశారు. నా భార్య అలా అనడంతో నేను నా భార్యను క్షమాపణలు కోరానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 5 కోట్ల మంది ప్రజల కొరకు మన ఫ్యామిలీ బలైనా పరవాలేదని నేను నా భార్యతో చెప్పానని పవన్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.