భారత జట్టుకి రోహిత్ తరువాత కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వద్దు అని క్రికెట్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగా మారింది. ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్‌లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు కూడా! ఆ సమయంలో కెప్టెన్‌గా, ఆటగాడిగా సమర్థవంతంగా రాణించడం చూసి.. రోహిత్ తర్వాత అతడే టీమిండియాకు పర్ఫెక్ట్ కెప్టెన్ అనే కామెంట్లూ వినిపించాయి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. హార్దిక్‌కి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హార్దిక్‌ని భారత టీ20 జట్టుకి కెప్టెన్‌గా నియమించవద్దని క్రికెట్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుని గొప్పగా నడిపిస్తున్న సంజూ శాంసన్‌కి రోహిత్ తర్వాత భారత టీ20 జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. ‘‘టీ20 వరల్డ్‌కప్ 2024లో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదు. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టులో సంజూ శాంసన్‌ని తీసుకోవాలి. అంతేకాదు.. రోహిత్ తర్వాత టీ20 కెప్టెన్‌గా సంజూని తీర్చిదిద్దాలి అని క్రికెట్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.