టాలీవుడ్ లో ఉన్న అందమైన జంటల్లో వరుణ్ సందేశ్, వితికా షేరుల జంట ఒకటి. సినీ పరిశ్రమకి నటిగా పరిచయమైనా వితికా షేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కెరీర్ లో ఎదుగుతున్నప్పుడే నటుడు వరుణ్ సందేశ్ ని 2016లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లై ఇన్నేళ్లవుతున్నా వీరికి పిల్లలు కలగలేదు. దీనిపై తాజాగా వితిక క్లారిటీ ఇచ్చారు.
వితికా షేరు మాట్లాడుతూ.. అందరూ పిల్లల గురించి అడుగుతారు. నాకు కూడా పిల్లలు చాలా ఇష్టం. 2018లో నేను ఫస్ట్ టైం ప్రగ్నెంట్ అయ్యాను. అప్పుడు మేము అమెరికాలో ఉన్నాము. నేను ప్రగ్నెంట్ అవ్వడంతో సందేశ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరికి చెప్పేసాడు. కానీ కొన్ని రోజులకే గర్భస్రావం జరిగింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చాము. నాకు పీరియడ్స్ రాకపోవడంతో మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ కి వెళ్తే ప్రగ్నెంట్ అని చెప్పారు. నేను ఆల్రెడీ మిస్ క్యారేజ్ జరిగింది అని చెప్పాను. మళ్ళీ టెస్టులు చేసి, సర్జరీ చేసి కడుపులో ఉన్న ఆ బేబీ పార్టికల్స్ అన్ని తీసేసారు. దాన్నుంచి కోలుకోవడానికి కొంత టైం పట్టింది. నా భర్త ఫైనాన్సియల్ గా కూడా స్ట్రాంగ్ గా అయ్యాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం. ప్రగ్నెంట్ అయితే నేనే అందరికి చెప్తాను అని తెలిపింది.