Homeహైదరాబాద్latest NewsVIRAL: వినూత్నంగా వెడ్డింగ్ కార్డ్.. ట్రెండ్ సెట్ చేస్తున్నారు కదా గురూ!

VIRAL: వినూత్నంగా వెడ్డింగ్ కార్డ్.. ట్రెండ్ సెట్ చేస్తున్నారు కదా గురూ!

ఈ నెల 20న మా సిన్న కొడుకు లగ్గం యాది ఉంచుకొని అందరూ వచ్చి మా పిల్లా పిలగాన్ని దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితది’ అంటూ తెలంగాణ యాస ఉట్టిపడేలా ఉన్న ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. అలాంటి పెళ్లిని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లి వేడుకను కొందరు కోట్లు ఖర్చు పెట్టే అంగరంగ వైభవంగా చేసుకుంటే మరికొందరు మాత్రం సింపుల్ గా కొద్దిమంది సమక్షంలోనే చేసుకుంటారు. ఎలాంటి పెళ్లి వేడుకకు అయినా బంధుమిత్రులను పిలిచేందుకు ఆహ్వానం తప్పనిసరి. అయితే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని ఈదులలింగంపేటకు చెందిన సతీష్ రెడ్డి తన పెళ్లి ఆహ్వాన పత్రికను ఎప్పటికీ గుర్తుండి పోయేలా వినూత్నంగా తయారు చేయించాడు. తెలంగాణ యాస ఉట్టిపడేలా ‘వెల్మలోళ్ల లగ్గం పిలుపు’ అంటూ వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయించాడు. సతీష్ రెడ్డి క్రియేటివిటీకి బంధుమిత్రులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img